గ్లోబల్ సమ్మిట్‌కు భారీ బందోబస్తు
HYD: గ్లోబల్ సమ్మిట్‌కు బందోబస్తులో ఎలాంటి పొరపాట్లకు తావుండకూడదని, అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని శాంతి భద్రతల అదనపు DG మహేశ్ భగవత్ సూచించారు. భద్రత ఏర్పాట్లను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, IG రమేశ్ రెడ్డి, DCP నారాయణ రెడ్డితో కలిసి నిన్న ఆయన పరిశీలించారు. ఈ సదస్సుకు దేశ, విదేశాల పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రముఖులు సుమారు 600 మంది హాజరవుతున్నారు.