జోగి రమేష్‌కు 10 రోజుల రిమాండ్

జోగి రమేష్‌కు 10 రోజుల రిమాండ్

కృష్ణా: నకిలీ మద్యం కేసులో మాజీమంత్రి జోగి రమేష్‌కు కోర్టు రిమాండ్ విధించింది. ఆయనతో పాటు ఆయన తమ్ముడు జోగి రాముకి కూడా ఈ నెల 13 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. కాసేపట్లో వీరిని విజయవాడ సబ్ జైలుకు తరలించనున్నారు. నకిలీ మద్యం కేసులో A1 జనార్దనరావు వాంగ్మూలం ఆధారంగా నిన్న రమేష్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.