VIDEO: ప్రశాంతంగా కొనసాగుతున్న 10వ తరగతి పరీక్షలు
SRPT: నడిగూడెం మండలంలో పదో తరగతి హిందీ పరీక్ష సందర్భంగా ఈరోజు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రంలోకి అధికారులు అనుమతించారు. మండల కేంద్రంలోని బాలుర, బాలికల పాఠశాలల్లో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన పోలీస్ భద్రత ఏర్పాట్లు చేశారు.