ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం
KNR: మానకొండూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు గృహాలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.