'సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి'

సీజనల్ వ్యాధులు పట్ల ఆశా వర్కర్లు అప్రమత్తంగా ఉండాలని గురివినాయుడుపేట పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ సురేష్ చంద్ర దేవ్ తెలిపారు. మంగళవారం పాచిపెంట మండలం గురివినాయుడుపేటలో ఆశా కార్యకర్తలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న వేసవికాలం ఎండలు ఎక్కువగా ఉంటాయని, ప్రజలకు తగు జాగ్రత్తలు పాటించే విధంగా అవగాహన కల్పించాలని కోరారు.