ఫైలేరియాపై సమన్వయ కమిటీ సమావేశం

ఫైలేరియాపై సమన్వయ కమిటీ సమావేశం

జగిత్యాల జిల్లాలో ఫైలేరియా (బోధకాలు) వ్యాధిపై బుధవారం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం అడిషనల్ కలెక్టర్ బీ.రాజగౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. జిల్లాలో వ్యాధి తీవ్రత 1% కంటే తక్కువగా ఉండటం, డోసియర్ సమర్పణకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో డాక్టర్ సుజాత ఫైలేరియా వ్యాప్తి, నివారణ చర్యలు వివరించారు.