ప్రజాదర్బార్‌ను నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రజాదర్బార్‌ను నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రకాశం: సంతనూతలపాడులోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. కొంతమంది నూతన పెన్షన్ మంజూరు కొరకు, కొత్త రేషన్ కార్డులు కొరకు, అర్జీలను అందజేశారు. అర్జీలను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.