VIDEO: పూసలపాడులో వ్యక్తిపై గొడ్డలితో దాడి
ప్రకాశం: బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామంలో బొగ్గు చిన్న రంగయ్య అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన వడ్డే లాజర్ అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. భార్యాభర్తల గొడవల నేపథ్యంలో అడ్డుగా వెళ్లిన రంగయ్యపై లాజర్ దాడి చేయగా రంగయ్య మోచేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.