మునగాలపల్లిలో ప్రజా దర్బార్ కార్యక్రమం
NTR: చందర్లపాడు మండలం మునగాలపల్లిలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను క్షుణ్ణంగా విని, వాటికి సంబంధించిన అర్జీలను స్వీకరించారు. జనహితమే మనహితం అన్న నినాదంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.మండల కూటమి నాయకులు పాల్గొన్నారు.