'జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి'

SRD: నారాయణఖేడ్‌లోని తహసీల్దార్ మైదానంలో ఈనెల 11, 12 తేదీల్లో జరిగే వాలీబాల్ టోర్నమెంట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. నారాయణఖేడ్‌లో బుధవారం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. 11న అండర్-14, 17 బాలురకు, 12న బాలికలకు జిల్లాస్థాయి పోటీలు జరుగుతాయని చెప్పారు.