పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
BHPL: భూపాలపల్లి సింగరేణి పాఠశాల కృష్ణ కాలనీలో ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీరాణి పదవీ విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. MLA మాట్లాడుతూ.. ఝాన్సీరాణి తన వృత్తిపట్ల అపారమైన నిబద్ధతతో పనిచేసి పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేశారని, ఆమె సేవలు విద్యార్థులు, తల్లిదండ్రుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.