'మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కరించాలి'
MHBD: కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే మున్సిపల్ యంత్రాంగం చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ నాయకుడు కన్నెబోయిన శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పాలకవర్గం పట్టించుకోవడంలేదని విమర్శించారు. దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని వాపోయారు.