తేజస్ అమరుడికి భార్య, కుమార్తె చివరి వీడ్కోలు

తేజస్ అమరుడికి భార్య, కుమార్తె చివరి వీడ్కోలు

దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వింగ్ కమాండర్ నమాన్ష్ భౌతికకాయాన్ని హిమాచల్ ప్రదేశ్‌లోని స్వస్థలమైన పాటియాల్కర్‌కు తీసుకొచ్చారు. అంత్యక్రియలకు ముందు ఆయన భార్య వింగ్ కమాండర్ అఫ్షాన్, కుమార్తె చివరిసారిగా నమాన్ష్‌కి వీడ్కోలు పలికారు. అక్కడికి వచ్చిన వారంతా సైనికుల కుటుంబాల ధైర్యం అసాధారణమని కొనియాడుతూ, ఆ వీరుడికి నివాళులు అర్పించారు.