భారీ వర్షాలు.. ఐదుగురు మృతి

భారీ వర్షాలు.. ఐదుగురు మృతి

అసోంను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల కారణంగా పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ఆయా ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు NDRF సిబ్బంది తరలిస్తున్నారు. వరద బాధితుల కోసం సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ వరదలతో పదివేల మంది ప్రభావితమయ్యారు. వర్షాల కారణంగా కామరూప్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు ప్రాణాలు విడిచారు.