ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు

ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు

KNR: కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ మహాశక్తి దేవాలయం ఒక తెలంగాణ అన్నవరంగా మారింది. దేవాలయంలో ప్రత్యేకంగా పూలతో అలంకరించిన మండపం వేయగా, అందులో సామూహికంగా శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతం కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించారు.