VIDEO: అంబుజా సిమెంట్‌పై ప్రజాభిప్రాయమే కీలకం
VSP: పెదగంట్యాడలో ప్రతిపాదిత అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజల అభిప్రాయమే తమ ప్రభుత్వ తుది నిర్ణయమని గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సోమవారం స్పష్టం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి ముందు ప్రజల అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రజా వ్యతిరేకతను కూటమి ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపారు.