'నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి'

'నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి'

PLD: జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బి.కృష్ణారావు నిన్న గుంటూరు ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. సమర్థవంతంగా విధులు నిర్వహించాలని, ప్రజల్లో పోలీసుల పట్ల విశ్వసనీయత పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని పేర్కొన్నారు.