అభివృద్ధికి చిరునామా కేసీఆర్: మాజీ ఎమ్మెల్యే
WGL: నగరంలోని BRS కార్యాలయంలో వర్ధన్నపేట నియోజకవర్గం 40వ డివిజన్ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే A. రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమల్లో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయిందన్నారు. గతంలో KCR హయాంలోనే సమగ్ర అభివృద్ధి జరిగిందని, ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్నారు. అభివృద్ధికి చిరునామా KCR అన్నారు.