ముద్దాయి ఆత్మహత్య కేసు విచారణ: సీఐ
NDL: కొలిమిగుండ్ల మండలం బెలూంలో 2 రోజుల క్రితం జరిగిన ట్రాక్టర్ దొంగతనం కేసులో ముద్దాయిగా ఉన్న బెలుం శింగవరంకి చెందిన వెంకటసుబ్బయ్య (35) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముద్దాయిపై గతంలో 3 కేసులు ఉండగా, మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న ఆందోళనలో బెలుం శింగవరం సమీపంలో ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సీఐ రమేశ్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు.