చిన్నారిపై ఆయా దాడి.. ఏసీపీ వివరణ
TG: జీడిమెట్లలో నర్సరీ విద్యార్థినిపై ఆయా దాడి చేసిన ఘటనపై ACP వివరాలు వెల్లడించారు. 'విద్యార్థిని తల్లిదండ్రులు ఒడిశా నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. అదే స్కూల్లో పనిచేస్తున్న చిన్నారి తల్లి సంతోషి స్కూల్ పిల్లలను ఇంటి వద్ద వదిలేందుకు వెళ్లింది. ఆ సమయంలో చిన్నారి ధరిత్రిని ఆయా లక్ష్మమ్మ విచక్షణారహితంగా కొట్టింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం' అని తెలిపారు.