జాతీయ రహదారిపై దుర్ఘటన.. బాలుడు స్పాట్ డెడ్

జాతీయ రహదారిపై దుర్ఘటన.. బాలుడు స్పాట్ డెడ్

బాపట్ల: పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కనమర్లపూడి సమీపంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న బాలుడిని ట్రాలీ ఆటో బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.