మోదీ.. నన్ను క్షేమంగా భారత్‌కు తీసుకురండి: నటి

మోదీ.. నన్ను క్షేమంగా భారత్‌కు తీసుకురండి: నటి

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో నటి సోనాల్ చౌహాన్ దుబాయ్‌లో చిక్కుకుంది. విమాన సర్వీసులు రద్దు కావడంతో ఆమె అక్కడే ఆగిపోయింది. ఈ క్రమంలో భారత్‌కు తిరిగి వచ్చేందుకు సాయం చేయాలని ప్రధాని మోదీకి ఆమె విజ్ఞప్తి చేసింది. 'నేను సురక్షితంగా ఇంటికి చేరడానికి సహకరించండి' అంటూ సోషల్ మీడియా వేదికగా కోరింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.