మద్యం సేవిస్తూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

మద్యం సేవిస్తూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

అన్నమయ్య జిల్లా నీరుగట్టువారిపల్లిలో దినకర్ వైన్స్ వద్ద మద్యం సేవిస్తూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. దినకర్ వైన్స్‌లో ఏర్పాటు చేసిన పర్మిట్ రూంలో మద్యం సేవిస్తూ గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.