అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
WGL: రాయపర్తి మండలం కొత్తూరు గ్రామ శివారులో గురువారం అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతిచెందిన ఘటన కలకలం రేపింది. మృతుడిని దామెర శ్రీనివాస్ (33)గా గుర్తించగా, అతను పర్వతగిరి మండలం రావూరు గ్రామానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. శ్రీనివాస్ మృతి వెనుక కారణాలపై స్పష్టత కోసం పోలీసులు కుటుంబ సభ్యులను, పరిచయస్తులను విచారిస్తున్నారు.