సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై
ASR: రాజవొమ్మంగి మండలంలోని తంటికొండలో నిన్నసైబర్ నేరాలపై ఎస్సై లతాశ్రీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోజురోజుకీ సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా వేదికలలో వచ్చే అనుమానాస్పద లింకులను ఓపెన్ చేయవద్దని, బ్యాంకు వివరాలు, ఓటీపీలను ఇతరులకు చెప్పకూడదని హెచ్చరించారు.