నేటి నుంచి శ్రీ అభయాంజనేయ స్వామి వార్షికోత్సవం
శ్రీకాకుళం కొత్తదమ్మల వీధిలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం 27-28 తేదీలలో జరుగుతుంది. 27న శ్రీరామ నవమి సందర్భంగా స్వామివారికి తమలపాకులు, పువ్వులు, సింధూరంతో పూజలు ఉంటాయి. 28న క్షీరాభిషేకం, పంచామృత అభిషేకం, మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కమిటీ సభ్యులు కోరారు.