మహిళ లకు వసుధ ఫౌండేషన్ కుట్టు మిషన్లు పంపిణీ

WG: వసుధ ఫౌండేషన్ ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమని భీమవరం కేజీఆర్ ఎల్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ సురేష్ చంద్ర.జీ అన్నారు. పోడూరు మండలం జన్నూరు గ్రామంలో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సబ్సిడీపై కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రామకోటి రాజు, ఫౌండేషన్ కన్వీనర్ పీ.బుద్ధరాజు తదితరులు పాల్గొన్నారు.