నెట్‌బాల్ టోర్నీలో కొండాపూర్ విద్యార్థుల ప్రతిభ
NRPT: ధన్వాడ మండలం కొండాపూర్ గిరిజన బాలుర గురుకులం విద్యార్థులు నెట్‌బాల్ టోర్నీలో ఉత్తమ ప్రతిభను కనబరిచారు. ఇటీవల నల్గొండ జిల్లా హాలియాలో జరిగిన రాష్ట్ర స్థాయి ఈవెంట్‌లో ద్వితీయ బహుమతి సాధించారు. ఈ మేరకు మంగళవారం గురుకులం ప్రిన్సిపల్ ఎం.రాజారాం విద్యార్థులను అభినందించారు. జేవీపీ సాంబ్యానాయక్, పీఈటీ ఆంజనేయులు, అధ్యాపకులు పాల్గొన్నారు.