ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయం: MLA

ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయం: MLA

BDK: దమ్మపేట మండలంలో ఎమ్మెల్యే ఆది నారాయణ శనివారం పర్యటించారు. మొండివర్రె కాలనీలో నిర్మాణం, పునాది దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం శ్రీరామపురం లింగాలపల్లి గ్రామపంచాయతీలో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ప్రజా సంక్షేమమే రెండు కళ్ళుగా భావిస్తున్నట్లు వెల్లడించారు.