దేవునిపల్లి వీడీసీ సభ్యులకు సన్మానం

KRD: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులను గురువారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమాకాంత్ రావు ఆధ్వర్యంలో శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ వీడీసీ అధ్యక్షుడు మర్కంటి స్వామి, నూతన అధ్యక్షుడు గూడెల్లి గంగారం, ఉపాధ్యక్షులు నిట్టు లింగారావు, వంగ రాహుల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.