ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో భూక్య రాజకుమార్ 30 అనే యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక సీఐ సురేందర్ రెడ్డి కథనం ప్రకారం మద్యానికి అలవాటు పడిన రాజ్ కుమార్ విచ్చలవిడిగా తిరిగేవాడు. కుటుంబ సభ్యులు మందలించడంతో శనివారం ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడినట్లు తెలిపారు.