ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

VZM: సింహాచలం దేవస్థానంలో జరిగిన ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి బుధవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎల్ కోట ఆమె క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రమాద ఘటన దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధ్యులపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని తెలిపారు.