పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

VKB: ధారూర్ మండల పరిధిలో రాజాపూర్ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారి డాక్టర్ సురేందర్ నాయక్ ఆధ్వర్యంలో పశువులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుర్వ దివ్య శ్రీశైలం, గ్రామ పెద్దలు, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.