గజ్వేల్ బంద్.. బస్ డిపో ఎదుట బీఆర్ఎస్ బైఠాయింపు

గజ్వేల్ బంద్.. బస్ డిపో ఎదుట బీఆర్ఎస్ బైఠాయింపు

SDPT: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడికి నిరసనగా సోమవారం బీఆర్ఎస్ నాయకులు గజ్వేల్ బంద్ చేపట్టారు. బంద్‌లో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛర్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి బైఠాయించారు. బస్ డిపో నుంచి బస్సులను బయటకు వెళ్లకుండా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి.