బొబ్బిలిలో 13 ప్రాంతాల్లో వాహన తనిఖీలు
VZM: బొబ్బిలి పట్టణంలో సోమవారం పోలీసులు 13 ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహించారు. 1,792 వాహనాలు తనిఖీ చేసి 108 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ. 42,835 చలానా విధించారు. అలాగే 326 వాహనాల నుంచి పాత చలానాలుగా రూ. 1,18,835 వసూలు చేశారు. మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, వాహన చట్టాలపై డీఎస్పీ భవ్యరెడ్డి అవగాహన కల్పించారు.