12న ఓబుళంపల్లిలో వైద్య శిబిరం

12న ఓబుళంపల్లిలో వైద్య శిబిరం

ATP: చెన్నేకొత్తపల్లి మండల పరిధిలోని ఓబుళంపల్లిలో ఈనెల 12వ తేదీన వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఓబుళంపల్లి శ్రీసత్యసాయి సేవాదళ్ సభ్యులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో ఈ గ్రామంలో ప్రతి నెల 10వ తేదీన వైద్య శిబిరం జరిగేదన్నారు.. అయితే ఈనెల నుంచి 12వ తేదీన మెడికల్ క్యాంపు జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.