హైడ్రోజన్ బెలూన్ ద్వారా సరుకుల రవాణా

హైడ్రోజన్ బెలూన్ ద్వారా సరుకుల రవాణా

NTR: అమరావతిలో జరిగిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవంలో విజయవాడకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ హైడ్రోజన్ ఆధారిత ఎయిర్‌షిప్‌లను ప్రదర్శించింది. విజయవాడకు చెందిన డా. సీవీఎస్ కిరణ్, పి.శిరీష వీటిని రూపొందించారు. కిలో సరుకు రవాణాకు రూ.100 లోపు వ్యయంతో వీటిని 20-100 కి.మీ.ల దూరానికి ఉపయోగించవచ్చని వారు తెలిపారు.