వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

ELR: జంగారెడ్డిగూడెం వేంకటేశ్వర స్వామి ఆలయంలో పారిజాతగిరి ప్రదక్షిణ మార్గ ప్రారంభ కార్యక్రమం శనివారం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈమేరకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆలయం ఎంతో చరిత్ర కలిగిన పవిత్ర స్థలంగా పేరుగాంచిందని తెలిపారు. పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రం అని అన్నారు.