గరివిడిలో కలెక్టర్ పర్యటన

గరివిడిలో కలెక్టర్ పర్యటన

VZM: గరవిడి మండలంలో జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. ముందుగా ఆయన తహసీల్దారు కార్యాలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పట్టాదారు పాస్ పుస్తకాల పరిశీలన ప్రక్రియను తనిఖీ చేశారు. ఆ ప్రక్రియ గురించి తహసీల్దారు బంగార్రాజును అడిగి తెలుసుకున్నారు. తప్పులు లేని పట్టాదారు పాస్ పుస్తకాలను తయారు చేయాలని ఆదేశించారు.