నరసరావుపేటలో అవ్వారి భవన్నారాయణ 32వ వర్ధంతి
PLD: నరసరావుపేట ఏఐటీయూసీ కార్యాలయంలో వర్క్ ఛార్జ్డ్ కార్మిక నాయకుడు అవ్వారి భవన్నారాయణ 32వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్మిక సంక్షేమానికి చేసిన కృషిని నాయకులు కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖాళీ పోస్టుల భర్తీ, పాత పెన్షన్ విధానం అమలు, కార్మికులకు గృహ స్థలాల కేటాయింపు వంటి డిమాండ్లపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.