VIDEO: ఉపాధి హామీ పనుల పరిశీలన
PDPL: బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే కుట్రలో భాగంగా పని దినాలను సగానికి తగ్గించి, నిధులు విడుదల చేయకుండా పేదల పొట్ట కొడుతోందని తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ జాగృతి వ్యవస్థ ఉపాధ్యక్షురాలు కవిత ఆదేశాల మేరకు హనుమంతునిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలను కలుసుకొని, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.