సర్పంచ్ ఎన్నికల్లో ఖాతా తెరిచిన టీడీపీ

సర్పంచ్ ఎన్నికల్లో ఖాతా తెరిచిన టీడీపీ

KMM: మధిర మండల పరిధిలోని అల్లినగరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఆవుల పెద్దిరాజు సర్పంచ్ విజయం సాధించారు. తన గెలుపునకు కృషిచేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, ఓటర్లకు ఆయన పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని పెద్దిరాజు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.