రాబోయే రెండు గంటల్లో.. భారీ వర్షం
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా పలు మండలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ శాఖ అధికారులు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. రాబోయే 2 గంటల్లో కొన్ని గ్రామాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడవచ్చని, క్లౌడ్ బరస్ట్ సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.