భర్త ఇంటి ముందు భార్య ధర్నా
SRPT: ప్రేమించి పెళ్లి చేసుకున్న తనను కట్నం కోసం వేధించి, గర్భిణి అని కూడా చూడకుండా ఇంటి నుంచి వెళ్లగొట్టారని మోతే మండలం ఉర్లుగొండలో భర్త ఇంటి ముందు భార్య ఆందోళన చేపట్టింది. 5 నెలల గర్భిణి అయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించినా భర్త నుంచి బెదిరింపులు వస్తున్నాయని, తప్పనిసరి పరిస్థితుల్లో అతడి ఇంటి ముందే మౌన దీక్షకు దిగింది.