ఇమ్మడి గోపి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్

ఇమ్మడి గోపి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్

NZB: ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి హత్యకు గురైన ఇమ్మడి గోపి హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇందులో మేనల్లుడు సతీష్‌తో పాటు శ్రీధర్, రవి, ప్రశాంత్, దేవేందర్, మరో వ్యక్తిని శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.