దేవరకొండ జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతల స్వీకరణ

NLG: దేవరకొండ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జిగా స్నేహ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన జడ్జి హరీష్ బాబు పదోన్నతిపై వెళ్లడంతో ఆమె నియమితులయ్యారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఆమెకు పూల బొకే అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాతంగి వీరబాబు, సూపరింటెండెంట్ గిరిధర్, శ్రీనివాస్, అలీ, సాబూర్ అలీమ్, దేవేందేర్, మురళి, సబియా నాయుడు పాల్గొన్నారు.