'భూమైనా ఇవ్వండి.. పథకమైనా మంజూరు చేయండి'

AKP: మత్స్యకార భరోసా పథకం మంజూరు చేయాలని పూడిమడకకు చెందిన మత్స్యకారుడు కొరివి బండియ్యా అధికారులకు విజ్ఞప్తి చేశారు. పూడిమడక సచివాలయం వద్ద గురువారం మాట్లాడుతూ..తన భార్య పేరున 109 ఎకరాలు భూములు ఉన్నాయని రెవెన్యూ మత్స్యశాఖ అధికారులు చెప్పడం విస్మయం కలిగించిందన్నారు. అధికారులు చెప్పిన విధంగా తనకి ఆ భూములు ఇప్పించాలన్నారు. లేదా భరోసా పథకం మంజూరు చేయాలన్నారు.