మావుళ్లమ్మ నిత్యాన్నదాన పథకానికి విరాళం

W.G: భీమవరం శ్రీ మావుళ్లమ్మ శాశ్వత నిత్యాన్నదాన పథకానికి దాతలు రూ.2 లక్షల విరాళం అందించారు. భీమవరానికి చెందిన ఎం.వెంకట గోపాల సత్యనారాయణ శర్మ కుటుంబం రూ.లక్ష, శ్రీఖర ఇంజినీరింగ్ సర్వీసెస్ రూ.లక్ష అమ్మవారి ఆలయ అభివృద్ధి పనుల కోసం విరాళంగా ఇచ్చాయి. శనివారం ఈ విరాళాలను ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేశ్ స్వీకరించారు.