పారిశుద్ధ్య పనులు పరిశీలించిన కమిషనర్

GNTR: పొన్నూరు పురపాలక సంఘం కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు గురువారం పట్టణంలోని పలు ప్రాంతాలను పర్యటించారు. పర్యటనలో భాగంగా పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. 25వ వార్డులో డ్రైనేజ్ కాలువల్లో మట్టి, వ్యర్థాలు పేరుకుపోయిన విషయాన్ని గమనించిన కమిషనర్, వెంటనే వాటిని తొలగించేలా సంబంధిత సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు.