దివ్యాంగుల వద్దకు వెళ్లి అర్జీలు స్వీకరించిన ఎస్పీ
కాకినాడ SP బిందుమాధవ్ సోమవారం నిర్వహించిన PGRSకు 35 అర్జీలు అందాయి. వీటిలో భూవివాదాలు 9, కుటుంబ తగాదాలు 2, ఇతర సమస్యలు 15 ఉన్నాయి. దివ్యాంగుల వద్దకు SP నేరుగా వెళ్లి స్వయంగా అర్జీలు తీసుకోవడం ఆకట్టుకుంది. ప్రతి ఫిర్యాదును ఏడు రోజుల్లో పరిష్కరించాలని పోలీసులను ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.